News May 1, 2024
రేపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక

అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ సెంట్రల్ కమిటీ రేపు ప్రకటించనుంది. రాహుల్ పోటీ చేసి ఓడిన అమేథీలో తిరిగి ఆయన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే వయనాడ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాయ్‌బరేలీలో పోటీ చేసేందుకు ప్రియాంకా గాంధీ సుముఖత వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News April 10, 2026
IPL: నేడు తొలి ఓటమిని రుచి చూసేదెవరో?

IPLలో ఈరోజు గువాహటి వేదికగా RCB, RR మధ్య 7.30PM నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. RR ఆడిన 3 మ్యాచులూ గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. RCB 2 విజయాలతో మూడో స్థానంలో ఉంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా RCB 17, RR 14 విక్టరీలు సాధించాయి. కాగా నేటి మ్యాచుకు వర్షం ముప్పు లేదని క్రిక్‌బజ్ పేర్కొంది.
News April 10, 2026
75% అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు!

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాజరు 75% లేకపోతే పరీక్షలకు అనుమతించొద్దని, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయనుంది. అలాగే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీలో చేరిన రోజే విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
News April 10, 2026
‘హార్ముజ్’ వద్ద టోల్ వసూలు చేయవద్దు: ట్రంప్

‘హార్ముజ్’ వద్ద ఇరాన్ టోల్ వసూలు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ఒకవేళ ఫీజు వసూలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని సూచించారు. ఇక ఇరాన్‌పై తాను ముందస్తు విజయం ప్రకటించుకున్నట్లు WSJ ప్రచురించడంపై ట్రంప్ మండిపడ్డారు. తాము విక్టరీ సాధించామని, ముందస్తు అనేదే లేదన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకుండా చేస్తానని చెప్పారు. ఆ దేశ సాయం లేకపోయినా త్వరలోనే ఆయిల్ యథావిధిగా సరఫరా అవుతుందన్నారు.


