News February 15, 2026
ADB: ప్రేమ వంచన.. తల్లైన ఇంటర్ విద్యార్థిని

ADB ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రసవం కావడం కలకలం రేపింది. గతంలో హాస్టల్‌లో ఉండి చదువుకున్న బాలిక, ఆ తర్వాత ఇంటి నుంచే కళాశాలకు వెళ్లేది. ఇటీవల ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించగా గర్భవతిగా తేలింది. శనివారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. HYD యువకుడే బాధ్యుడని అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాలిక తెలిపలేదని ICPS బృందం తెలిపింది.
Similar News
News February 21, 2026
తిరుమలలో శ్రీవారికి నిర్వహించే పూజలివే..

ఏడు కొండలపై కొలువైన శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తారు. సుప్రభాతంతో మేల్కొలుపు, తోమాలతో పూల అలంకరణ, అర్చనతో నామస్మరణ నిర్వహిస్తారు. మలయప్పస్వామికి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి వైభవ సేవలు జరుగుతాయి. వారంలో ఒకరోజు అభిషేకం, తిరుప్పావడ, నిజపాద దర్శనం వంటి విశేష సేవలు ఉంటాయి. చివరగా రాత్రి ఏకాంత సేవతో పవళింపు జరిపి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.
News February 21, 2026
‘కావేరి వామన్’ అరటి రకం ప్రత్యేకతలు

ప్రస్తుతం ఎక్కువగా సాగవుతున్న గ్రాండ్ నైన్(G9) అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో ‘కావేరి వామన్’ రకం రూపొందించారు. ఈ చెట్టు ఎత్తు కేవలం 4.9 నుంచి 5.25 అడుగులే ఉంటుంది. దీని గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తులో ఉండే ఈ గెలలో 8–10 పండ్ల హస్తాలుంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. ఒకటిన్నర నెలల ముందే గెల కోతకొస్తుంది. పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగుకు అనుకూలం.
News February 21, 2026
జగిత్యాల: 3 రోజులు ‘భగీరథ’ నీటి సరఫరా నిలిపివేత

మెట్‌పల్లి (M) వెంకట్రావు పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు కారణంగా మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ తెలిపారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఈనెల 23 నుంచి 25 వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.


