News February 15, 2026

నంద్యాల: ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి

image

‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారిన రచయిత నందికొట్కూరు మండలం అల్లూరుకు చెందిన <<19145947>>శ్రీనివాస్<<>>(48) మృతిచెందారు. నిన్న ఆయన ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లా కూసుమంచి(M) పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ నీటిలో మునిగి మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానిస్తున్నారు.

Similar News

News February 19, 2026

భువనగిరి: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

భువనగిరి జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 4.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.

News February 19, 2026

ఉమ్మడి వరంగల్‌లో పెరిగిన సాగు!

image

వరంగల్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో రైతన్నలు ఆదాయం గడిస్తుంటారు. అయితే, మొక్కజొన్న సాగులో గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. 2,32,145ఎకరాల్లో గతేడాది మొక్కజొన్న పండిస్తే 3,37,394ఎకరాల్లో ప్రస్తుతం సాగవుతోంది. గతేడాది 5,77,628 ఎకరాల్లో వరి పండిస్తే 6,10,215ఎకరాల్లో ఈసారి సాగవుతోంది. అన్ని పంటలు కలిపి ఉమ్మడి జిల్లాలో 9,55,387 ఎకరాల్లో సాగవుతోంది.

News February 19, 2026

నేవీలో ఆఫీసర్ పోస్టులు.. పరీక్ష లేకుండానే..

image

260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. జీతం ₹1.25-1.5 లక్షలు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/