News February 15, 2026
ఖమ్మం: ‘ప్రపంచస్థాయి ప్రమాణాలతో బోధన’

ఖమ్మం హార్వెస్ట్ ప్రైమరీ పాఠశాల 24వ వార్షికోత్సవం శనివారం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లాక్రీడల అధికారి సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కరికులమ్ ద్వారా విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నామని కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Similar News
News February 25, 2026
PDPL: సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు

రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్ కట్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్ ఫాల్ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుడికి నాణ్యమైన వైద్యం అందించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు.
News February 25, 2026
బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్తో వంటి గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటి, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
News February 25, 2026
చిత్తూరు: పన్ను వసూళ్ల గడువు పెంపు

గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్ల గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల డీపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పరిధిలో రూ.27.41 కోట్ల పన్ను వసూలు లక్ష్యంలో ఇప్పటివరకు రూ.18.63 కోట్లు(68 శాతం) వసూలైనట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. డీఎల్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


