News May 1, 2024

హన్మకొండ: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య?

image

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శాయంపేట మండలానికి చెందిన తేజేశ్వర్ వరంగల్ మెడికేర్ హాస్పిటల్ వద్ద ట్రైన్ కింద పడి మరణించారు. కులాంతర వివాహం చేసుకొన్న తేజేశ్వర్.. భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 12, 2025

ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు

image

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News January 12, 2025

న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలి: హైకోర్టు జడ్జి

image

ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి& జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి బి.విజయసేన్ రెడ్డి అన్నారు. శనివారం చేర్యాలలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. చేర్యాల, కొమరవెల్లి, ధూల్ మిట్ట, మద్దూర్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు మేము బాధ్యతగా చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

News January 12, 2025

ఉమ్మడి వరంగల్ క్రైం న్యూస్

image

> JN: తీగారంలో గంటల వ్యవధిలో దంపతుల మృతి> > ఇంటర్ విద్యార్థిని సూసైడ్> సూసైడ్ > షాక్ తో కాడేడ్లు మృతి > WGL: > బెట్టింగ్.. ఆన్లైన్ సూసైడ్> NSPT: చిన్నారిపై పిచ్చికుక్క దాడి> JN: ఇసుక అక్రమ > కేసు నమోదు> MHBD: పూసల తండా శివారులో > నల్లబెల్లం పట్టివేత> WGL: గుట్కా విక్రయం.. అరెస్టు >