News February 15, 2026
భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం గావించి, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ వేడుకలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం అర్చకులు నిర్వహించారు.
Similar News
News February 19, 2026
T20WC.. శ్రీలంకపై జింబాబ్వే సంచలన విజయం

T20WCలో మరో సంచలనం నమోదైంది. ఇటీవల ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే ఇవాళ శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత లంక 20 ఓవర్లలో 178/7 రన్స్ చేసింది. అనంతరం జింబాబ్వే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ బెన్నెట్ (63*), సికిందర్ రజా 45 పరుగులతో తమ జట్టును గెలిపించారు. ఇప్పటికే జింబాబ్వే సూపర్-8లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
News February 19, 2026
‘రఫేల్’ భారత్‌ను బలోపేతం చేస్తుంది: మాక్రాన్

ఫ్రాన్స్‌తో భారత్ 114 రఫేల్ విమానాల డీల్ ప్రతిపాదనను ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ సమర్థించారు. ఈ డీల్‌పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ డీల్ భారత్‌ను బలోపేతం చేస్తుందని, భారత్-ఫ్రాన్స్ బంధం పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇక రఫేల్ యుద్ధవిమానాల లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై సానుకూలంగా స్పందించారు. సబ్‌మెరైన్ల ప్రాజెక్ట్‌పైనా ఇరు దేశాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు.
News February 19, 2026
ఏలూరు: ‘అధికారుల తీరుపై ఉపేక్షించే ప్రసక్తే లేదు’

జిల్లా అధికారులు నిర్లక్ష్యంతో లక్ష్యాలను పూర్తి చేయకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ వెట్రీ సెల్వీ తేల్చి చెప్పారు. పంచాయతీరాజ్, జే రామ్ జీ, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, హౌసింగ్, ఇరిగేషన్ తదితర నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..అంబెడ్కర్ గురుకులాలకు మంజూరైన 49 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లకు 16 పనులు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


