News May 1, 2024
ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా మేనిఫెస్టో: ఎంపీ అభ్యర్థి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా కూటమి మేనిఫెస్టో ఉందని, యువతీ యువకుల కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో రూపొందించిన ఘనత కూటమి పార్టీలకే దక్కిందని నంద్యాల లోక్ సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాలలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారని, యువతకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
Similar News
News March 10, 2026
కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్

పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 13 న విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రెండు విడతల్లో రూ.4,000 చెల్లించగా, చివరి విడతగా మరో రూ.2,000 నేరుగా రైతుల ఖాతాల్లో (DBT ద్వారా) జమ కానున్నాయన్నారు. నిధులు సజావుగా అందాలంటే KYC ప్రక్రియను పూర్తి చేయాలి, భూ రికార్డులు ఆధార్‌తో అనుసంధానమవాలన్నారు.
News March 10, 2026
కర్నూలులో KGBVలలో అడ్మిషన్లు ప్రారంభం

కేజీవీబీలో పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ లోకరాజు తెలిపారు. జిల్లాలోని 26 పాఠశాలల్లో ప్రతి తరగతికి 40 సీట్లు ఉండగా, ఇతర తరగతుల్లో ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. SC, ST, BC, మైనారిటీ, BPL, అనాథలు, డ్రాప్‌అవుట్ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఏప్రిల్ 1 చివరి తేది అన్నారు.
News March 10, 2026
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలను తనిఖీ చేయాలి: జేసీ

కలెక్టరేట్ నుంచి జేసీ నూరుల్ ఖమర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, రెవెన్యూ, ప్రజాభిప్రాయం వంటి అంశాలపై సమీక్షించిన జేసీ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సూచించారు.


