News February 15, 2026
శివరాత్రి వేళ శివాలయాల్లో భారీ బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం సహా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా పర్యటించి ట్రాఫిక్, క్యూలైన్లు, అత్యవసర సేవలపై సమీక్షించారు. కపిలతీర్థంలో విజిలెన్స్ అధికారులతో పరిశీలన చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేశారు.
Similar News
News February 21, 2026
వినుకొండ చేరుకున్న CM చంద్రబాబు

సీఎం నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండ చేరుకున్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.
News February 21, 2026
నల్గొండ: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం

2026 జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నారు. 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తి గలవారు మార్చి 31, 2026 లోపు జిల్లా చేనేత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.


