News February 15, 2026
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జాతర బందోబస్తు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బి.గితే సూచించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా బందోబస్తును ఆయన ఆదివారం పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసుల సమన్వయంతో వ్యవహరించాలని, క్యూలైన్ల నియంత్రణలో సహకరించాలని కోరారు.
Similar News
News February 19, 2026
భువనగిరి: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

భువనగిరి జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 4.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.
News February 19, 2026
ఉమ్మడి వరంగల్‌లో పెరిగిన సాగు!

వరంగల్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో రైతన్నలు ఆదాయం గడిస్తుంటారు. అయితే, మొక్కజొన్న సాగులో గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. 2,32,145ఎకరాల్లో గతేడాది మొక్కజొన్న పండిస్తే 3,37,394ఎకరాల్లో ప్రస్తుతం సాగవుతోంది. గతేడాది 5,77,628 ఎకరాల్లో వరి పండిస్తే 6,10,215ఎకరాల్లో ఈసారి సాగవుతోంది. అన్ని పంటలు కలిపి ఉమ్మడి జిల్లాలో 9,55,387 ఎకరాల్లో సాగవుతోంది.
News February 19, 2026
నేవీలో ఆఫీసర్ పోస్టులు.. పరీక్ష లేకుండానే..

260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. జీతం ₹1.25-1.5 లక్షలు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/


