News May 1, 2024
NLG: రేపటి నుంచి శిక్షణ షురూ: కలెక్టర్
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల కోసం నియమించిన సిబ్బందికి ఈ నెల 2 నుంచి 4 వరకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.
Similar News
News January 12, 2025
నల్గొండ: సంక్షేమ పథకాలపై సమన్వయ సమావేశం
నల్గొండ: ఉదయాధిత్య భవనంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు& ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
News January 12, 2025
యాదాద్రిలో మూడో రోజు కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో భక్తులకు నరసింహుడి దర్శనమిచ్చారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు యాదగిరీషుడు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.
News January 12, 2025
MLG: ప్రణయ్ హత్య కేసులో ట్విస్ట్
MLGలో 2018లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాశ్ శర్మ, మరో ఇద్దరు బెయిల్ కోసం సమర్పించిన ష్యూరిటీలు నకిలీవి అని పోలీసులు గుర్తించారు. వారిని MLG పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో బెయిల్పై బయటికొచ్చిన అమృత తండ్రి మారుతిరావు సూసైడ్ చేసుకున్నారు.