News May 1, 2024

పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు దొంగతనం

image

AP: ఓ హోంగార్డు పోలీస్ స్టేషన్‌లోనే చోరీకి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని రెండో టౌన్ PSలో హోంగార్డు మనోజ్ దొంగతనం చేశాడు. నకిలీ తాళంతో బీరువాలోని రూ.5.63 లక్షలు కాజేశాడు. పోలీసులు అతడి నుంచి రూ.3 లక్షలు రికవరీ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 24, 2026

RCB అమ్మకం.. కొత్త ఓనర్ ఎవరంటే?

image

RCB జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కన్సార్షియంలో బిర్లా గ్రూప్, US కంపెనీలు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్‌, టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు $1.78Bతో(₹16,706Cr) ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్(Diageo) యజమానిగా ఉంది.

News March 24, 2026

ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

image

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.

News March 24, 2026

మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

image

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్‌లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.