News February 16, 2026
క్లోరిన్ గ్యాస్ లీకేజీపై యంత్రాగం అప్రమత్తం: కలెక్టర్

బలిజిపేట మండలం అంపావల్లిలో జరిగిన క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తం అయిందని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. లీకేజీ ప్రభావంతో అస్వస్తతకు గురైన ఏడుగురిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, వైద్యాన్ని అందించారన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు.
Similar News
News February 20, 2026
మెదక్: 22న బేస్ లైన్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలకు ఎస్.వెంకటస్వామి కో ఆర్డినేటర్ 8008403635 ఫోన్ చేయాలని సూచించారు.
News February 20, 2026
బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల వీటి తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరి, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
News February 20, 2026
అరుదైన విరాళం: వాటర్ పైపుల కోసం 21కిలోల బంగారం!

జపాన్‌లోని ఒసాకా నగరాభివృద్ధి కోసం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. సుమారు ₹30 కోట్ల విలువైన ఈ గోల్డ్‌ను నగరంలోని పాతబడిన వాటర్ సిస్టమ్‌ను బాగు చేసేందుకు ఉపయోగించాలని కోరారు. 40ఏళ్ల నాటి డ్రైనేజీ, తాగునీటి పైపుల వల్ల వస్తున్న లీకేజీ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ విరాళం అందజేశారు. గతంలోనూ సదరు వ్యక్తి ₹3 లక్షలు డొనేషన్ ఇచ్చినట్లు మేయర్ యొకోహామా వెల్లడించారు.


