News May 1, 2024
ఏలూరు జిల్లాలో 1,744 పోలింగ్ కేంద్రాలు

ఏలూరు జిల్లాలో ఒక అనుబంధ పోలింగ్ స్టేషన్‌తో కలిపి 1,744 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ బుధవారం తెలిపారు. పోలవరం అసెంబ్లీలో 284, చింతలపూడి 273, దెందులూరు 239, ఉంగుటూరు 214, ఏలూరులో 213 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటికి ఆన్‌లైన్ ద్వారా ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించామన్నారు. కైకలూరు 235, నూజివీడులో 286 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
Similar News
News March 13, 2026
తాడేపల్లిగూడెం: మూడు బార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3 జనరల్ కేటగిరి బార్ లైసెన్స్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 ఉదయం 8 గంటలకు భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో లక్కీ డ్రా తీయనున్నట్లు వివరించారు.
News March 13, 2026
పర్యాటకాభివృద్ధిపై దృష్టి: కలెక్టర్

సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ సి.నాగరాణి పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధిపై చర్చ సందర్భంగా.. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోటళ్ల నిర్మాణానికి అనువుగా రెండు చోట్ల ఆర్‌అండ్‌బీ స్థలాలను గుర్తించి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె ఈ సమావేశంలో వివరించారు.
News March 12, 2026
ప.గో: డ్రోన్ల వినియోగం భేష్.. కలెక్టర్‌కు సీఎం ప్రశంస

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.


