News May 1, 2024
LS ELECTIONS: భువనగిరిలో గెలుపెవరిది?
TG: భువనగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా, ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(INC) 2009లో గెలిచి, 2014లో ఓడారు. 2014లో గెలిచిన బూర నర్సయ్య గౌడ్ (BRS) 2019లో వెంకట్‌రెడ్డి (INC) చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో కిరణ్ కుమార్(INC), బూర నర్సయ్య (BJP), క్యామ మల్లేశ్(BRS), జహంగీర్ (CPM) పోటీలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News December 25, 2024
క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్
ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.
News December 25, 2024
రేపటి టెస్టులో రోహిత్ ఓపెనింగ్!
రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. యశస్వీతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తోంది.
News December 25, 2024
ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం
TG: ఫార్ములా-ఈ రేస్ కేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేసింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ-రేస్‌లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దాన కిషోర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.