News May 1, 2024
HYD: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడిపై కేసు

మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 3, 2026
రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఆలయాలు మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఫరూఖ్‌నగర్ మండంలోని ఉత్తరరామలింగేశ్వ రస్వామి, ఎలికట్ట అంబాభవానీ ఆలయాలు, చేవెళ్లలోని వేంకటేశ్వర ఆలయం, కడ్తాల్ మం.లోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం శుద్ధి చేసి తెరుస్తామన్నారు.
News March 2, 2026
RR: ప్రజావాణికి 51 ఫిర్యాదులు: కలెక్టర్

రంగారెడ్డిలో కలక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News March 1, 2026
RR: డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

హెల్త్ మిషన్-100లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతున్నామని DMHO డా.లలితాదేవి అన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 2,25,020 మంది మహిళా సభ్యుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.


