News May 1, 2024

స్మార్ట్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్

image

DRDO పరీక్షించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో(SMART) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని కలాం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించారు. DRDO-ఇండియన్ నేవీ సంయుక్తంగా స్వదేశీ సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ఇది శత్రు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంలో సాధారణ టార్పిడోల కంటే చాలా ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది.

Similar News

News December 25, 2024

‘బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?

image

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్‌లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం. వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు <<14584831>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

News December 25, 2024

ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య

image

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హనుమకొండలోని ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.

News December 25, 2024

మళ్లీ జోరు పెంచిన BITCOIN

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పరుగులు పెట్టాయి. టాప్ 10 కాయిన్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. బిట్‌కాయిన్ ఏకంగా 3.99% పెరిగింది. $3789 లాభంతో $98,663 వద్ద ముగిసింది. నేడు $489 నష్టంతో $98,412 వద్ద కొనసాగుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 2.30% లాభంతో $3,485 వద్ద ట్రేడవుతోంది. XRP 1.46, BNB 1.75, SOL 4.30, DOGE 3.39, ADA 1.30, TRON 1.75, AVAX 5.90, LINK 2.68, SHIP 3.59% మేర ఎగిశాయి.