News May 1, 2024

13న మోదీ నామినేషన్

image

ప్రధాని మోదీ ఈనెల 13న వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించనున్నారు. మరోవైపు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.

Similar News

News March 20, 2026

CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

image

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.

News March 20, 2026

మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

image

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

News March 20, 2026

పాక్-అఫ్గాన్.. సోదరుల్లా ఉండండి: ఖమేనీ

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.