News May 1, 2024
చిత్తూరు: బ్యాంకుల వద్ద వృద్ధుల అవస్థలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచాయి. ఈక్రమంలో నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు అందజేశారు. ఆధార్ కార్డు లింకు అయిన బ్యాంకు ఖాతాల్లో మరికొందరికి నగదు జమ చేశారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Similar News
News March 20, 2026
చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
News March 20, 2026
బంగారుపాళ్యం: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంగారుపాళ్యంలో జరిగింది. పాపానివారి పల్లె కోళ్ల ఫారంలో బిహార్‌కు చెందిన లితీశ్ కుమార్ పనిచేస్తున్నాడు. కోళ్ల ఫారం యజమాని ప్రభుతో కలిసి బైకుపై కేజీ సత్రానికి బయలుదేరారు. వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో లితీశ్ కుమార్ జాతీయ రహదారిపై పడ్డాడు. అటువైపు వెళుతున్న ట్యాంకర్ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News March 20, 2026
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.


