News February 16, 2026

ఫేక్ లింకులపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

image

కర్నూలులో ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC, లోన్ ఆఫర్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News April 20, 2026

కర్నూలు: కాలువలో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అదృశ్యం కాగా, ఆదివారం గ్రామ సమీపంలోని LLC కాలువలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. తమ గారాల పట్టి మరణంతో తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News April 19, 2026

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకొని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు రామయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

News April 19, 2026

కర్నూలు జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానం, సెకండియర్‌లో ఎనిమిదో స్థానం నిలిచిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,477 మందికి 16,356 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 18,999 మందికి 16,077 మంది పాసయ్యారు. 2,922 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.