News May 1, 2024
ప్రేమ కోసం టైమ్ వేస్ట్ చేసుకోను: మనీషా కోయిరాలా
హీరామండీతో మరోసారి అలరించిన నటి మనీషా కోయిరాలా లవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితంలో ఓ తోడు ఉంటే బాగుంటుంది అని అనిపించేది. భాగస్వామి ఉండటం మంచి విషయమే. కానీ ఆ పార్ట్‌నర్ కోసం ఎదురుచూసి సమయం వృథా చేసుకోను. మనకి రాసిపెట్టి ఉంటే వస్తారు. ప్రస్తుతం జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’ అని తెలిపారు. కాగా 2010లో సామ్రాట్ దహల్ అనే వ్యాపారవేత్తతో మనీషా వివాహం కాగా 2012లో వారు విడిపోయారు.
Similar News
News January 4, 2025
1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టు పరిధిలోని 1673 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టుల్లో జూనియర్, ఫీల్డ్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు 1277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184, హైకోర్టులో మరో 212 ఉద్యోగాలున్నాయి. JAN 8 నుంచి 31లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఏ జిల్లాల్లో ఎన్ని ఉద్యోగాలున్నాయనే వివరాల కోసం ఇక్కడ <
News January 4, 2025
బుమ్రా ఖాతాలో మరో ఘనత!
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. నిన్న ఖవాజాను ఔట్ చేసిన జస్ప్రీత్, ఈరోజు లబుషేన్‌ను ఔట్ చేసి సిరీస్‌లో వికెట్ల సంఖ్యను 32కు పెంచుకున్నారు. ఈక్రమంలో 46 ఏళ్ల క్రితం బిషన్ సింగ్ బేడీ నెలకొల్పిన రికార్డు తిరగరాశారు. భారత బౌలింగ్ భారం మొత్తాన్ని బుమ్రా ఒక్కరే మోస్తుండటం గమనార్హం.
News January 4, 2025
కెనడాలో పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్
దేశవిదేశాల్లో పుష్ప-2 రికార్డుల మోత కొనసాగిస్తోంది. తాజాగా కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లను అధిగమించింది. కెనడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.