News May 1, 2024
రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: రేవంత్
TG: రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే RSS మూల సిద్ధాంతమని, దాన్ని అమలు చేయడమే BJP అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంపై సమీక్షించాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రసంగ సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉంది. ఆధారాలతో సహా నేను వాదిస్తున్నా. మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు’ అని రేవంత్ తెలిపారు.
Similar News
News January 4, 2025
కెనడాలో పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్
దేశవిదేశాల్లో పుష్ప-2 రికార్డుల మోత కొనసాగిస్తోంది. తాజాగా కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లను అధిగమించింది. కెనడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.
News January 4, 2025
మళ్లీ బండి సంజయ్‌కే టీబీజేపీ పగ్గాలు?
TG: రాష్ట్రంలో బీజేపీ పగ్గాల్ని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కే మరోమారు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీని సంజయ్ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. కాగా.. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల ఉన్నారు.
News January 4, 2025
ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్టులు
ఏపీలో కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో 7 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఫీజిబిలిటీ సర్వే పూర్తైంది. మిగతాచోట్ల సర్వే చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిగిన సమీక్షలో CM చంద్రబాబు కోరారు. అటు గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో నిర్మించనున్నారు.