News May 1, 2024

‘ఆఫీస్ పికాకింగ్‌’తో ఉద్యోగులను రప్పిస్తున్నారు!

image

కార్పొరేట్ కల్చర్‌లో ఇప్పుడు ‘ఆఫీస్ పికాకింగ్’ అనే మరో ట్రెండ్ చేరింది. వర్క్‌ఫ్రమ్ ఆఫీస్‌కు వ్యతిరేకంగా నామమాత్రానికి ఆఫీసుకు వచ్చి వెళ్లిపోయే ‘కాఫీ బ్యాడ్జింగ్’ ట్రెండ్‌‌ను కొందరు ఉద్యోగులు నడిపారు. ఇందుకు కౌంటర్‌గా ఇప్పుడు యజమాన్యాలు ఈ ‘ఆఫీస్ పికాకింగ్’ ట్రెండ్ తెచ్చాయి. లగ్జరీ సోఫాలు, ఆహ్లాదకరమైన మొక్కలు, లాంజ్‌ స్టైల్‌లో క్యుబికల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయట.

Similar News

News January 4, 2025

1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

తెలంగాణ హైకోర్టు పరిధిలోని 1673 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టుల్లో జూనియర్, ఫీల్డ్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు 1277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184, హైకోర్టులో మరో 212 ఉద్యోగాలున్నాయి. JAN 8 నుంచి 31లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఏ జిల్లాల్లో ఎన్ని ఉద్యోగాలున్నాయనే వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 4, 2025

బుమ్రా ఖాతాలో మరో ఘనత!

image

భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఆయన రికార్డు స‌ృష్టించారు. నిన్న ఖవాజాను ఔట్ చేసిన జస్ప్రీత్, ఈరోజు లబుషేన్‌ను ఔట్ చేసి సిరీస్‌లో వికెట్ల సంఖ్యను 32కు పెంచుకున్నారు. ఈక్రమంలో 46 ఏళ్ల క్రితం బిషన్ సింగ్ బేడీ నెలకొల్పిన రికార్డు తిరగరాశారు. భారత బౌలింగ్ భారం మొత్తాన్ని బుమ్రా ఒక్కరే మోస్తుండటం గమనార్హం.

News January 4, 2025

కెనడాలో పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్

image

దేశవిదేశాల్లో పుష్ప-2 రికార్డుల మోత కొనసాగిస్తోంది. తాజాగా కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లను అధిగమించింది. కెనడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.