News February 16, 2026

రసవత్తరంగా కరీంనగర్, NZB మేయర్ ఎన్నిక!

image

TG: కాసేపట్లో మేయర్ ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎక్స్‌అఫీషియోతో కలిపి 69(66+3) ఓట్లున్నాయి. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని BRS నిర్ణయించడంతో ఓట్ల సంఖ్య 60కి, మ్యాజిక్ ఫిగర్ 31కి మారింది. MP బండి సంజయ్‌తో కలిపి 34 ఓట్లున్న BJPకే మేయర్ పీఠం దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. అటు NZBలో BJP 28, CONG 17, MIM 14, BRS 1 సీట్లున్నాయి. CONG-MIM కలిసి మేయర్ పీఠం దక్కించుకోవచ్చు.

Similar News

News March 1, 2026

ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం.. ట్రంప్ ప్రకటన

image

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను అంతమొందించామని వెల్లడించారు. US-ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే సైనిక ఆపరేషన్ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.

News March 1, 2026

‘అబ్రహం లింకన్‌’ షిప్‌పై దాడి జరగలేదు: US

image

తమ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘అబ్రహం లింకన్‌’పై <<19274213>>దాడి<<>> జరిగిందన్న వార్తలను US సెంట్రల్ కమాండ్ ఖండించింది. దాడి చేశామని ఇరాన్ చెప్పిందంతా అబద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘లింకన్‌ను ఏ మిస్సైల్ కూడా ఢీకొట్టలేదు. దాని దగ్గరగా కూడా చేరుకోలేదు. ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను తొలగించి అమెరికన్లను రక్షించేందుకు సెంట్రల్ కమాండ్‌తో కలిసి లింకన్ షిప్ విమానాలను ప్రయోగిస్తోంది’ అని స్పష్టం చేసింది.

News March 1, 2026

10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10% పెరిగి బ్యారెల్‌కు $80కి చేరుకుంది. ఇది మరింత పెరిగి $100కి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గం ద్వారా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. ప్రపంచంలోని 20-30% ఆయిల్, LNG ఈ మార్గం గుండానే కంపెనీలు తరలిస్తుంటాయి. ఇప్పుడు రవాణా ఆగిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్సుంది.