News February 16, 2026

పాలమూరు: నేడు ‘ప్రజావాణి’ రద్దు.. కారణం ఇదే!

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక అనంతరం తిరిగి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.

Similar News

News April 20, 2026

MBNR: అక్కడ.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 20, 2026

MBNR: ఓపెన్ స్కూల్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.