News February 16, 2026
నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.
Similar News
News February 19, 2026
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: రాఘవేంద్రరావు స్థానంలో భరద్వాజ

TG: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు సినిమాటోగ్రఫీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
News February 19, 2026
చైనా అద్భుతం.. స్టెమ్ సెల్ థెరపీతో డయాబెటిస్ నయం

చైనా సైంటిస్టులు అద్భుతం చేశారు. స్టెమ్ సెల్ థెరపీతో ప్రపంచంలోనే తొలిసారిగా టైప్-2 డయాబెటిస్ వ్యాధిని నయం చేశారు. ఆరోగ్యకరమైన ప్యాంక్రియాటిక్ కణాలను మార్పిడి చేసి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేశారు. ఈ చికిత్స విజయవంతమైంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.
News February 19, 2026
డయాబెటిస్ రోగుల్లో స్టెమ్ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది?

తొలుత డయాబెటిస్ రోగి లేదా దాత నుంచి స్టెమ్ సెల్స్‌ను తీసుకుంటారు. ల్యాబ్‌లో ప్రత్యేక రసాయనాలు, జెనెటిక్ విధానాల ద్వారా ప్యాంక్రియాటిక్(ఇవి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను, చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి) కణాలను రూపొందిస్తారు. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరగానే రోగి శరీరంలోకి మార్పిడి చేస్తారు. బాడీ వాటిని స్వీకరించే దానిని బట్టి సక్సెస్ రేటు ఉంటుంది.


