News February 16, 2026
జగిత్యాల జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జిల్లాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ దృష్ట్యా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపల్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Similar News
News February 25, 2026
సిరిసిల్ల: ‘మొబైల్ రికవరీ మేళా’.. 63 ఫోన్ల అందజేత

మొబైల్ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల పోలీసులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పోయిన, చోరీకి గురైన రూ. 6 లక్షల విలువైన 63 మొబైళ్లను ఐటీ కోర్ టీం రికవరీ చేసింది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘మొబైల్ రికవరీ మేళా’లో ఎస్పీ మహేష్ బి. గితే బాధితులకు ఫోన్లను అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను వెలికితీసిన బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
News February 25, 2026
HYD: FSL హాల్ టికెట్లపై కీలక అప్డేట్.. రేపట్నుంచే

TG ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ(FSL) రాత పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని TSLPRB ఛైర్మన్ VV శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్ పీటీసీలో ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.