News May 1, 2024

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం: న్యాయమూర్తి తరణి

image

అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మికుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దుబ్బాక జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వేముగంటి తరణి అన్నారు. బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హబ్సిపూర్ శివారులో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొన్నారు.

Similar News

News March 18, 2026

మెదక్: ‘కార్మిక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి’

image

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం ఢిల్లీలోని ESIC ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్మిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

News March 18, 2026

నిజాంపేట: తిప్పన్నగుల్లలో కాకతీయ కాలపు శివాలయం గుర్తింపు

image

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

News March 18, 2026

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

image

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.