News February 16, 2026

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో పోస్టులు

image

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో 13 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీ, MBA, MSc, BSc, ME/MTech(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), MBBSఅర్హతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్‌ను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mptgoa.gov.in

Similar News

News February 17, 2026

BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

image

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్‌ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.

News February 17, 2026

100 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్-4: శ్రీధర్ బాబు

image

TG: జినోమ్ వ్యాలీని విస్తరిస్తూ ఫేజ్-4ను 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో 2035 నాటికి $25B పెట్టుబడుల లక్ష్యంగా ప్లాన్ రూపొందించాం. Trident AI కంపెనీ (US) ₹300CR, Rx Propellant ₹1000CR పెట్టుబడి పెడుతున్నాయి. Opella (France) కంపెనీ ముందుకొచ్చింది. AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీలో యువతకు శిక్షణ ఇప్పిస్తాం’ అని బయో ఆసియా-2026 సదస్సులో తెలిపారు.

News February 17, 2026

వంగలో కాయకుళ్లు తెగులు – నివారణ

image

ఈ తెగులు సోకిన వంగ మొక్కల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మాడి రాలిపోతాయి. కాయలు పసుపు రంగుకు మారి కుళ్లిపోతాయి. నివారణకు నారు మడిలో విత్తేముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి.