News February 16, 2026

FLASH: NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా కాంగ్రెస్ నుంచి 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎన్నికకు హాజరైన మెజారిటీ సభ్యులు ఆమెకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆమెకు ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు.

Similar News

News April 17, 2026

TU: పాలకమండలి సభ్యులను అభినందించిన ఉపకులపతి

image

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలికి నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ అయిన సభ్యులు ఆచార్య ఆంజనేయులు, డా.సుధాకర్‌లను వీసీ సమక్షంలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ (అటుట్) ఆధ్వర్యంలో అభినందించారు. వీసీ ఆచార్య యాదగిరి రావు మాట్లాడుతూ.. పాలకమండలి సభ్యులు వర్సిటీ ప్రతిష్టను ఇనుమడింప చేసేలా, అభివృద్ధిలో భాగమై పనిచేయాలన్నారు. రిజిస్ట్రార్ యాదగిరి, అటుట్ సభ్యులు పాల్గొన్నారు.

News April 17, 2026

ADB: కేసీఆర్ ‘జైత్రయాత్ర’.. మారనున్న సమీకరణాలు..?

image

ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న ‘జైత్రయాత్ర’ బహిరంగ సభతో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కేసీఆర్ సమక్షంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సాకుతో కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త నేతలను ఆకర్షించడంపై గులాబీ దళం దృష్టి పెట్టింది. జీవన్ రెడ్డి చేరికతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తోంది.

News April 17, 2026

ఈ నెల 22న టీయూలో అన్యువల్ డే

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న అన్యువల్ డే నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది తెలంగాణ విశ్వవిద్యాలయ అన్యువల్ డేకి హాజరుకావాలని ఆదేశించారు. సంవత్సరంలో జరిగిన ప్రగతిని నివేదించడంతో పాటు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, విద్యార్థుల భవిష్యత్తుపై మార్గ నిర్దేశం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.