News February 16, 2026

TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

image

* నిజామాబాద్ మేయర్‌‌గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్‌గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష(కాంగ్రెస్)

Similar News

News April 20, 2026

నిమ్మ.. ధర అదిరిందమ్మ

image

యాడికి మండలంలో నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 1100 కాయలున్న బస్తా ధర రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మండల పరిధిలోని దాదాపు 1000 ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడి దిగుబడి హైదరాబాద్, సిరిగొండ, హోస్పేట, బళ్లారి, హుబ్లీ వంటి నగరాలకు ఎగుమతి అవుతోంది. ఆశించిన లాభాలు వస్తుండటంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 20, 2026

సీఎం చంద్రబాబుపై సినిమా

image

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.

News April 20, 2026

చేతికి రెండు ఫ్రాక్చర్లు.. అయినా మూడు వికెట్లు

image

ఫామ్ లేమితో సతమతమైన KKR స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు నిన్న RRతో జరిగిన మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయితే IPL సీజన్‌కు ముందు తాను గాయపడ్డట్లు వరుణ్ తెలిపారు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్‌లో 2 ఫ్రాక్చర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ నొప్పితోనే బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నట్లు తెలిపారు.