News February 16, 2026

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా నివేదిత

image

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ ఛైర్మన్‌గా మహమ్మద్ షఫీ ఉల్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. మంత్రి ఉత్తమ్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని నూతన పాలకవర్గం ప్రకటించింది.

Similar News

News April 18, 2026

మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

image

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!

News April 18, 2026

మహిళలకు విపక్షాల ద్రోహం: CM

image

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.

News April 18, 2026

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో రోజువారీ నమోదవుతున్న ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.