News February 16, 2026

భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీవాణి

image

భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా పోతంశెట్టి మంజుల ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. నూతన ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్‌లకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 27, 2026

మార్చి తొలి వారం నుంచే మండే ఎండలు!

image

AP: రాష్ట్రంలో మే నుంచి జులై మధ్యలో లేదా ఆగస్టులో <<19097558>>ఎల్ నినో<<>> వచ్చే అవకాశం అధికంగా ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. దీనివల్ల ఖరీఫ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాయి. మరోవైపు మార్చి తొలివారంలోనే ఎండలు, ఉక్కపోత పెరిగే ఛాన్స్ ఉందని IMD వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది.

News February 27, 2026

మెదక్: నాడు అడిషనల్ కలెక్టర్.. నేడు కలెక్టర్!

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేశారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న ప్రతిమా సింగ్ తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా మెదక్ కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే ప్రతిమా సింగ్ కలెక్టర్‌గా ఎలాంటి మార్కు చూపిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News February 27, 2026

ఉమ్మడి కృష్ణాజిల్లా నేతల్లో విజేతలు వీరే..!

image

లెజిస్లేటివ్ క్రీడా పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు తమ క్రీడా ప్రతిభను చాటారు. జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో MLAలు శ్రీరామ్ తాతయ్య, గద్దె రామ్మోహన్ విజేతలుగా నిలిచారు. క్యారమ్స్‌లో వర్ల కుమార్ రాజా, గద్దె రామ్మోహన్ గెలుపొందగా, బ్యాడ్మింటన్‌లో కాగిత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య, వర్ల కుమార్ రాజా విజేతలుగా నిలిచారు. పికిల్ బాల్ సింగిల్స్, చెస్ విభాగాల్లో రాము, కుమార్ రాజా గెలుపొందారు.