News February 16, 2026
ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18-40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380,
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000-24,470 వేతనం ఉంటుంది.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళంలో టీడీపీ మహానాడు: ఫైనల్ రేసులో పైడిభీమవరం?

‘మహానాడు’కు ఈసారి శ్రీకాకుళం జిల్లా వేదిక కావొచ్చనే సంకేతాలు ఉన్నాయి. ఆదివారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు బృందం ఎచ్చెర్ల, శ్రీకాకుళం పరిధిలోని మూడు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. అందులో పైడిభీమవరం ప్రాంతంపైనే ప్రాథమికంగా మొగ్గు కనిపిస్తోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణం, పార్కింగ్ వసతి సౌకర్యాలు అనుకూలంగా ఉండటంతో దీనిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

SKLM: అత్త చితికి తలకొరివి పెట్టిన కోడలు

సరుబుజ్జిలిలోని షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం జరిగింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు. దీంతో ఎర్రమ్మ కోడలు కళావతితో నివాసం ఉండేది. కొంతకాలంగా ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఆదివారం ఆమె మృతి చెందగా కుమారులెవరూ లేకపోవడంతో కోడలు కళావతి అంత్యక్రియలు చేశారు.