News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
Similar News
News February 21, 2026
హోలీ కోసం ఇంట్లోనే సహజ రంగులు

* పింక్ కలర్ కోసం బీట్‌రూట్‌లను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ద్రావణాన్ని వడకట్టి వాడొచ్చు. * ఎరుపు రంగు కోసం గులాబీ రేకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. తర్వాత ఎండలో పెట్టండి. ఎండబెట్టిన ఎరుపు మందార పువ్వులను పొడిగా చేసి, అందులో కొద్దిగా బియ్యప్పిండి కలిపితే ఎరుపు రంగు వస్తుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్‌గా వాడొచ్చు.
News February 21, 2026
70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://gailonline.com
News February 21, 2026
ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్‌ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.


