News May 1, 2024
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరో అతనేనా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితంపై త్వరలో సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. నిర్మాత సాజిద్ నడియాద్వాలా ప్రొడ్యూస్ చేయనున్న ఈ బయోపిక్‌లో ధనుష్ హీరోగా నటిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల రజనీతో దిగిన ఫొటోను సాజిద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లెజెండరీ మూవీ కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. దీంతో అది బయోపిక్ గురించేనంటూ చర్చ మొదలైంది.
Similar News
News March 12, 2026
15 నుంచి ఒంటిపూట బడులు.. జీవో జారీ

TG: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ GO జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో APR 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయని పేర్కొంది. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే 15న ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. బోర్డ్ ఎగ్జామ్స్ దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించింది.
News March 12, 2026
పెట్రోల్, డీజిల్ ఉంది.. ఆందోళన వద్దు: IOCL

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నామని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
News March 12, 2026
ఇండక్షన్ స్టవ్ కోసం చూస్తున్నారా?

వంటగ్యాస్ కొరతతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత శక్తితో పని చేస్తాయి. దానిపై ఉన్న కాపర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడి పాత్ర వేడెక్కుతుంది. అయితే ఈ స్టవ్‌పై అన్ని రకాల పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టవ్ ధరలు రూ.1,200-రూ.5,000 వరకు ఉంటాయి.


