News May 1, 2024
మార్కాపురం: రథోత్సవంలో అపశ్రుతి

మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు పాడుబడిన భవనంపై భక్తులు నిలబడి ఉండడంతో భవనం ముందు భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 3, 2026
వెలుగొండ నిర్వాసితులకు న్యాయం ఏది..?

వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు ముంపుకు గురికానుండగా.. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
News March 3, 2026
ప్రకాశం SP కార్యాలయానికి 80 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. SP హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన 80 వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత PS అధికారులతో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. అధికంగా భూ, ఆర్థిక తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగ మోసాలు వంటివి వచ్చాయన్నారు.
News March 2, 2026
10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: ప్రకాశం JC

ప్రకాశం జిల్లాలో ఈనె ల 16వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.


