News May 1, 2024
నెల్లూరు ఎంపీగా ఎవరు గెలుస్తారో

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 18సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 12సార్లు గెలవగా.. TDP 3సార్లు, YCP 2 సార్లు గెలిచింది. ప్రస్తుతం TDP తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, YCP నుంచి వి.విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కొప్పుల రాజు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి
Similar News
News March 19, 2026
ఎండలు.. నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, పాఠశాలల్లో వాటర్ బెల్, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు.
News March 18, 2026
నెల్లూరు: పాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

నెల్లూరు జిల్లాలో లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీప్రణతి ఫ్లోరా ఆధ్వర్యంలో నెల్లూరు పరిధిలోని 2 పాల కేంద్రాలపై దాడులు చేశారు. పాల నమూనాలను సేకరించారు. విడవలూరు మండల పరిధిలోని పాల కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డి.నీరజ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
News March 18, 2026
నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.


