News February 16, 2026

రావికంపాడు ROB పనులపై MP ఉదయ్ కీలక ఆదేశం

image

రావికంపాడు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి నిధుల మంజూరు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కాలపు ప్రయాణ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

సీఎం పర్యటన విజయవంతం: VZM కలెక్టర్

image

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఘనంగా.. విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జేసీ సేధు మాధవన్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యటనను నిర్వహించామని పేర్కొన్నారు.

News February 28, 2026

కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.

News February 28, 2026

RJY కల్తీ పాలు ఘటన.. 15 మందికి చికిత్స

image

RJY కల్తీ పాలు ఘటనలో బాధితులైన 15 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. వీరిలో కిమ్స్ లో 8 మంది, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు, డెంటల్‌లో ఇద్దరు, RACC, రవి చైతన్య ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.