News May 1, 2024
HNK: గ్రూప్1 ఉద్యోగాలంటూ.. రూ.20 కోట్లు దోచాడు!

తెలుగురాష్ట్రాల్లో గ్రూప్1 ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మోసం చేశాడు. బుధవారం సుబేదారి పోలీసులు హనుమకొండలో అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుచ్చిబాబు అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.20 కోట్లు దండుకున్నాడు. ఆ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి నష్షపోయాడు. ఈ క్రమంలో ఎవరికీ దొరకకుండా తిరుగుతుండగా బుధవారం పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News September 12, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లో అత్యధికంగా వరంగల్ మండలంలో 82.9 మి.మీ, గీసుగొండ 65.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 20.5 మి.మీ, కాగా మొత్తం 267.1 మి.మీ. వర్షం పడింది.
కొన్ని మండలాల్లో స్వల్పంగా వర్షపాతం నమోదు కాగా ఖానాపూర్, చెన్నారావుపేట మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
News September 10, 2025
WGL: గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారి అపర్ణ తెలిపారు. ఈనెల 12న ఉదయం 9 గంటలకు రాయపర్తి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్, ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మెరిట్ జాబితా ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారని పేర్కొన్నారు.
News September 10, 2025
ఫేక్ మెసేజ్‌లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు. లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి’ అంటూ వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను నమ్మొద్దని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లింకులు మోసాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి అని సూచించారు. ఫేస్బుక్లో అధికారిక పేజీ ద్వారా పోలీసులు విజ్ఞప్తి చేశారు.