News February 16, 2026

జనగామ మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

image

జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎంపిక నేపథ్యంలో జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.

Similar News

News April 18, 2026

SRHలోకి సౌతాఫ్రికా పేసర్

image

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.

News April 18, 2026

కృష్ణా: 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 1.50 లక్షలకు అమ్మేశారు!

image

కృష్ణా జిల్లాలో పది నెలల బాలుడి విక్రయం ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. పెనమలూరులో కిడ్నాప్‌కు గురైన బాలుడిని, నిందితులు మచిలీపట్నంలోని ఒక దంపతులకు రూ. 1.50 లక్షలకు విక్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని రక్షించారు. ఈ అక్రమ విక్రయ ఘటనలో ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

News April 18, 2026

వేల్పుగొండలో అత్యధిక ఉష్ణోగ్రత

image

కామారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో పల్వంచ మండలంలోని వేల్పుగొండలో అత్యధికంగా 43.9°C ఉష్ణోగ్రత నమోదైంది. దోమకొండ, బీబీపేట, మద్నూర్‌లో 43.8°C, బిక్కనూరులో 43.7°C నమోదు కాగా, మహమ్మద్ నగర్ మండలంలో అత్యల్పంగా 40°C నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.