News February 16, 2026

నల్గొండ: ఫలించిన ‘గుమ్మల’ నిరీక్షణ

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి నిరీక్షణ ఫలించింది. గతంలో పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న ఆయన, తాజాగా జరిగిన నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి తన సతీమణిని కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. డీసీసీ పదవి దక్కకపోయినా, ఈ గెలుపుతో మంత్రి తన రుణం తీర్చుకున్నారని, తమకు తగిన గౌరవం లభించిందని గుమ్ముల దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 19, 2026

పిల్లలకు మసాజ్ చేస్తున్నారా?

image

నెలల వయసున్న పిల్లలకి మసాజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీని వల్ల వారికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మసాజ్ వల్ల పిల్లల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్రోత్ హార్మోన్‌ను పెంచుతుంది. బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్‌కి మసాజ్ ఎంతో ఉపకరిస్తుందని సూచిస్తున్నారు.

News February 19, 2026

RGM: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన నేతల సస్పెండ్

image

రామగుండం MLA- MS రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, గుండెటి రాజేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. 8వ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించిన చాట్ల సదానందం, బెల్లంకొండ విజయేందర్ రెడ్డి, శనిగరపు తిరుపతి, శిలారపు లక్ష్మణ్, రాజశేఖర్, విగ్నేష్ లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

News February 19, 2026

క్యాబేజీ విత్తనాలను నాటే విధానం – జాగ్రత్తలు

image

క్యాబేజీ విత్తనాలు నాటే ముందు నేలను 4-5 సార్లు.. 100 చ.మీ. విస్తీర్ణంలో 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పి అవి మొలిచే వరకు రోజూ నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తాక ఎండిన ఆకులను తీసేయాలి. నారు కుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి. ఆకుతినే పురుగు నుంచి నారు రక్షణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml కలిపి పిచికారీ చేయాలి.