News February 16, 2026
కోదాడ: కర్ల రాజేశ్ తల్లికి పెన్షన్, భూమి, ఇల్లు: కలెక్టర్

పోలీస్ లాకప్‌లో మృతిచెందిన కోదాడకు చెందిన కర్ల రాజేశ్ మాతృమూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్, మూడు ఎకరాల భూమి, ఇళ్లు అందిస్తామని సోమవారం రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రామచంద్రన్‌కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది అందిస్తామన్నారు.
Similar News
News April 16, 2026
ఆదిలాబాద్: మేలుకో మిత్రమా..!

అందని ఎత్తులు.. అర్థం కాని వేగం.. సరదాగా మొదలై విషాదంగా ముగిసే మైనర్ల డ్రైవింగ్‌పై ఆదిలాబాద్ గడ్డపై ‘ఖాకీ’ హెచ్చరిక గంట మోగింది. “మీ బిడ్డల చేతికి బైక్ తాళాలు ఇవ్వడం అంటే.. మృత్యుపాశాన్ని అందించడమే” అని పోలీసులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో 400 మంది చిన్నారులు స్టీరింగ్ పట్టి రోడ్ల మీదకు రావడం ఆందోళనకరం. అల్లారుముద్దుగా పెంచుకున్న ప్రాణాలు రోడ్డు ప్రమాదాల రక్తపు మడుగులో కలవకముందే.. మేలుకోండి.
News April 16, 2026
NZB: ఆశావహులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పదవులు

కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు త్వరలో శుభవార్త అందనుంది. నిన్న CM రేవంత్ రెడ్డి, AICC ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల నేపధ్యంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులను మరో 2 రోజుల్లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి NZB జిల్లాలో 5 కార్పొరేషన్ చైర్మన్ పదవుల కాలపరిమితి ముగియనున్న నేపధ్యంలో పలువురు వాటిపై ఆశలు పెట్టుకున్నారు.
News April 16, 2026
వెల్లుల్లి రోజూ తింటే ఇన్ని లాభాలా..!

వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కాంపౌండ్ బీపీని తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. డైజెషన్ మెరుగుపడటంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీలోని వ్యర్థాలను తొలగించి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సహజసిద్ధమైన ఈ సూపర్ ఫుడ్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచీ రక్షణనిస్తుంది. వండటం వల్ల పోషకాలు నశిస్తాయి. పచ్చిగా తింటేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది.


