News May 1, 2024

WCకు సెలక్ట్ అయ్యారు.. ఇప్పుడు తుస్సుమంటున్నారు

image

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును నిన్న బీసీసీఐ ప్రకటించింది. అందులో సెలక్ట్ అయిన ప్లేయర్లు బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతున్నారు. నిన్న రోహిత్ 4, సూర్య 10, పాండ్య 0 విఫలం కాగా, ఇవాళ దూబే 0, జడేజా 2 పరుగులకే వెనుదిరిగారు. టీ20లకు ఫామ్ చాలా అవసరమని.. ఇప్పటికైనా జోరు పెంచాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Similar News

News March 21, 2026

8 గంటల ప్రయాణం తర్వాత విమానం యూటర్న్!

image

ఢిల్లీ నుంచి వాంకోవర్‌(కెనడా)కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 8Hr ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండైంది. కెనడాలో ఆ ఫ్లైట్‌కు పర్మిషన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ER విమానాలకు కెనడాలో అనుమతి ఉండగా, 777-200LRను పంపింది. చైనా గగనతలంలోకి వెళ్లాక తెలియడంతో అధికారులు వెనక్కి రప్పించారు. తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను పంపారు.

News March 21, 2026

దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

image

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.

News March 21, 2026

SLBCలో రెండు వైపులా తవ్వకాలు: ఉత్తమ్

image

TG: SLBC ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ‘ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రూల్స్ కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు.