News May 1, 2024
ఒంటిమిట్ట: రైలు ఢీకొని YCP కార్యకర్త మృతి

ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సొంట సుశాంత్ బుధవారం ప్రమాదవశాత్తు రైలు పట్టాలు దాటుతూ ఉండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై భూపేశ్ రెడ్డి కౌంటర్

వివేక్ కుమార్తె సునీతను అడ్డం పెట్టుకొని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని మీ మాయ మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
News March 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.
News March 17, 2026
సిద్దవటం: భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

సిద్దవటం మండలంలోని కపర్దేశ్వర స్వామి కోన వద్ద 2014లో జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్తను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న కేసులో భార్యతో పాటు మరో ముగ్గురిపై నేరం రుజువవడంతో కడప కోర్టు ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.


