News May 1, 2024
తెలంగాణలో రాహుల్, ప్రియాంక ప్రచార షెడ్యూల్

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఈనెల 5,9న.. ప్రియాంకా గాంధీ 5,7,9న ప్రచారం నిర్వహించనున్నారు. 5న నిర్మల్, గద్వాల్, 9న కరీంనగర్, సరూర్‌నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారు. 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్, 7న నర్సాపూర్, కూకట్‌పల్లి సభలకు ప్రియాంక హాజరవుతారు. మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా.. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున ప్రస్తుతం లాల్‌దర్వాజలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.
Similar News
News March 5, 2026
మామునూరు ఎయిర్పోర్టు.. హద్దులను పరిశీలించిన కలెక్టర్

మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల నేపథ్యంలో కొత్తగా భూసేకరణ చేసి హద్దులు నిర్ణయించిన ప్రాంతాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా సేకరించిన భూముల సర్వే నంబర్లు, నిర్ణయించిన హద్దులను కలెక్టర్ పరిశీలించారు. భూహద్దుల నిర్ధారణ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News March 5, 2026
❤️నచ్చేశావ్ సంజూ..

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.


