News February 17, 2026
JGTL: కాంగ్రెస్‌లో ‘జీవన్’ సెగ.. పార్టీ మార్పు తప్పదా?

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.
Similar News
News February 25, 2026
ఉమమహేశ్వర దేవాలయానికి 1800ఏళ్ల చరిత్ర

అమ్రాబాద్ మండలంలో కొలువుదీరిన పురాతన క్షేత్రం 1800 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుని కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామంతుల కాలంలో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది. శ్రీశైల మల్లికార్జున స్వామికి ‘ఉత్తర ద్వారం’గా వెలుగొందుతున్న ఈ క్షేత్రం చారిత్రకంగానూ ఎంతో విశిష్టతను సంతరించుకుంది.
News February 25, 2026
హనుమకొండలో సీపీఆర్‌పై అవగాహన

ప్రతి ఒక్కరికి సీపీఆర్‌పై అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చునని HNK డి.ఎం.హెచ్.ఓ డా. ఏ.అప్పయ్య ఆన్నారు. 100 రోజుల హెల్త్ క్యాంపెన్‌లో భాగంగా హనుమకొండ డి.ఎం.హెచ్.ఓ కార్యాలయంలో ఆర్బిఎస్కేకు చెందిన ఐదు బృందాల డాక్టర్లు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు పాఠశాలలో సీపీఆర్‌పై శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
News February 25, 2026
‘మీ టికెట్’తో ఆర్టీసీ సహా పలు సేవలు

TG: రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్ని టికెట్లు ఒకేచోట బుక్ చేసుకొనేలా ప్రభుత్వం ‘మీ టికెట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. RTC, మెట్రో రైలు టికెట్లు, పాసులు, దేవాలయాలు, టూరిస్టు ప్రాంతాలు, ఫారెస్టు సఫారీ, హైదరాబాద్‌లోని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, EV ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి టికెట్లను ముందే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా పొందొచ్చు.


