News May 1, 2024

NLG: రాజకీయ పార్టీలకు ఎస్పీ కీలక సూచన

image

పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల ప్రచార కరపత్రాలలో తప్పనిసరిగా ప్రవర్తన నియమావళి ప్రకారం ముద్రించాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రచార కరపత్రాలలో ప్రచురణకర్త పేరు, చిరునామా, ప్రింటర్ పేరు ఉండాలని,ఈ కరపత్రాలు ఎవరికి వ్యతిరేకంగా ఉండకూడదన్నారు. అంతేకాక ఏదైనా కులం, మతానికి అనుకూలంగా కానీ, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు లేకుండా నియమ నిబంధనలను పాటిస్తూ ప్రచురించాలని తెలిపారు.

Similar News

News March 12, 2026

నల్గొండలో బరి తెగిస్తున్న వడ్డీ మాఫియా

image

నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిగూడెంలో వడ్డీ డబ్బుల విషయంలో ఫైనాన్సర్లు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News March 11, 2026

టెన్త్ ఎగ్జామ్స్.. 19,835 మంది విద్యార్థులు: నల్గొండ DEO

image

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.

News March 11, 2026

NLG: మెనూ పాటించాల్సిందే: కలెక్టర్

image

మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం NLGలోని ఎస్ఎల్బీసీ మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్‌లోని గదులను వంట గదిని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను వంట బాగుందా?.. మెనూ ప్రతిరోజు అమలు చేస్తున్నారా?.. అని అడిగి తెలుసుకున్నారు.