News February 17, 2026
వనపర్తి: తొలి ఓసి మహిళా ఛైర్మన్ మాధవి రికార్డ్

వనపర్తి మున్సిపాలిటీకి ఈరోజు తొలి ఓసి మహిళా ఛైర్మన్‌గా ఎన్నికై వనపర్తి చరిత్రలో మిరిదొడ్డి మాధవి రికార్డ్ సృష్టించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి కౌన్సిలర్‌గా విజయం సాధించడమే గాక ఛైర్మన్‌గా ఎన్నికై జాక్పాట్ కొట్టారు. గతంలో రిటైర్డ్ టీచర్ ప్రమీలమ్మ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక కాగాఆమె బీసీ మహిళ కావడం విశేషం. ఆమెకు రాజకీయ నేపథ్యం ఉందని, రాజకీయాలకు కొత్తయిన మాధవి పాలన ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.
Similar News
News February 21, 2026
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఇంటర్ బోర్డు

AP: ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉ.9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని పేర్కొంది. ఫస్ట్, సెకండియర్ కలిపి 10,57,312 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు.
News February 21, 2026
మెటర్నిటీ లీవ్ గురించి తెలుసా?

మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళలకు గర్భం దాల్చిన సమయంలో ప్రత్యేకహక్కులు ఉన్నాయి. మొదటి ఇద్దరు పిల్లలకు 26 వారాల పెయిడ్ లీవ్స్ అందించాలి. తదుపరి పిల్లలకు 12 వారాల పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు లేదా సరోగసీ పేరెంట్స్ కూడా 12 వారాల సెలవు పొందవచ్చు. ఈ లీవ్స్ తీసుకున్నందుకు కంపెనీలు మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేవు.
News February 21, 2026
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.


