News May 1, 2024

నంద్యాల: వడదెబ్బతో యువతి మృతి

image

వడదెబ్బతో యువతి మృతిచెందిన ఘటన చాగలమర్రి మండల పరిధిలోని పెద్ద బోధనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన రాజా, శివమ్మ దంపతుల కుమార్తె డొంక సంధ్య(22) వడదెబ్బ కారణంగా విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News March 3, 2026

మంత్రి టీజీ భరత్ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా?

image

ఈ రెండేళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్ని పరిశ్రమలు తీసుకోచ్చారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా అని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారన్నారు. రాష్ట్రంలో పబ్‌లు తప్ప హబ్‌లు లేవన్నారు. కార్మిక రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.

News March 3, 2026

కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

image

కర్నూలు షరీఫ్ నగర్‌లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.