News February 17, 2026
KMR: మున్సి‘పల్స్’ అతివలదే

కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా పీఠాలెక్కిన వారంతా అతివలే. వైస్ ఛైర్మన్‌లుగా పురుషులకు అవకాశం ఉన్నప్పటికీ అధికారపక్షం మహిళా వికాసం వైపే మొగ్గుచూపింది. దీంతో జిల్లాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఛైర్మన్ మినహాయించి అన్ని చోట్ల మహిళలే పుర పీఠాలేక్కారు. జిల్లాలో మహిళాభుద్యాయం మరింత బలపడనుంది. రాజకీయాల్లో తాము సైతం రాణిస్తామని, అభివృద్ధికి పాటుపడతామంటున్నారు.
Similar News
News February 20, 2026
HYD: మ్యారేజ్ లైఫ్‌లో పాత పద్దతులకు చెక్

సర్దుకుపోవడం అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే కాదని యువత వివాహ వ్యవస్థలో పాత ధోరణులను పక్కన పెడుతున్నారు. పెళ్లి సామాజిక బాధ్యతే కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య సమానత్వం, గౌరవ బంధమని నమ్ముతున్నారు. నచ్చిన భాగస్వామిని ఎంచుకునే, జీవించే హక్కు ఉందని రాజ్యాంగం చెబుతోంది. బలవంతపు సర్దుబాట్లు ఒత్తిడికి దారితీస్తున్న తరుణంలో, యువత తమ కెరీర్, ఆన్‌లైన్ కమ్యూనిటీలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు.
News February 20, 2026
అభిషేక్.. దొరికిపోతావ్ జాగ్రత్త: అమీర్

టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించారు. అభిషేక్ ప్రతీ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి వీక్‌నెస్ పసిగట్టేస్తారని తెలిపారు. పాక్ ఓపెనర్ ఆయుబ్ తొలినాళ్లలో ఇలాగే ఆడి ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని.. అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
News February 20, 2026
మున్సిపల్ ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. క్యాతన్పల్లిలో BRS కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్‌పై దాడులు చేసిన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం విడ్డూరమని ఆక్షేపించారు. క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పై గవర్నర్ స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


